సంగారెడ్డి జిల్లా ఝరాసంఘం మండల పరిధిలోని సుప్రసిద్ధ దేవాలయం ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి వారిని శివరాత్రి సందర్భంగా కుటుంబ సమేతంగా స్వామివారిని దర్శించుకున్న నారాయణఖేడ్ శాసనసభ్యులు పట్లోళ్ల అనుపమ సంజీవరెడ్డి దంపతులు మరియు వారి సోదరులు డిసిసి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి, సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల సుధాకర్ రెడ్డి
అనంతరం వారు స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి అభిషేకం చేసి తెలంగాణ ప్రజలపై శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి వారి చల్లని చూపు ఉండాలని స్వామివారి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది తదనంతరం ఆలయ ప్రధాన అర్చకులు వారిని ఘనంగా శాలువాలతో సన్మానించి వారికి ఆశీస్సులు ఇవ్వడం జరిగింది మరియు ఈ కార్యక్రమంలో వారితోపాటు ఖేడ్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు భోజిరెడ్డి,దిలీప్ రెడ్డి, ఆలయ అధికారులు, ఝరాసంఘం మండల కాంగ్రెస్ నాయకులు, భక్తులు పెద్దఎత్తున పాల్గొన్నారు