Friday, March 14, 2025
ads
Homeజిల్లాలుఏఐజీ హాస్పిటల్‌కు కేసీఆర్‌.. సాధారణ పరీక్షల కోసమే!

ఏఐజీ హాస్పిటల్‌కు కేసీఆర్‌.. సాధారణ పరీక్షల కోసమే!

సత్యమేవ జయతే – హైదరాబాద్ హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ గచ్చిబౌలిలోని ఏఐజీ దవాఖానకు వెళ్లారు. సాధారణ వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్‌కు చేరుకున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వైద్య పరీక్షల అనంతరం ఆయన తిరిగి ఇంటికి చేరుకోనున్నారు. కాగా, బుధవారం పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశానికి కేసీఆర్‌ హాజరైన విషయం తెలిసిందే. దీంతో రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూడటానికి తెలంగాణ భవన్‌కు పెద్ద సంఖ్యలో యువత తరలివచ్చింది. చాలారోజుల తర్వాత కేసీఆర్‌ తెలంగాణ భవన్‌కు రావడంతో ఆయన ను చూడాలని, ఆయనతో సెల్ఫీ దిగాలనే ఉత్సాహంతో యవకులు తరలివచ్చారు. మ ధ్యాహ్నం ఒంటిగంటకు కేసీఆర్‌ వస్తారని షెడ్యూల్‌ ప్రకటించినప్పటికీ, ఉదయం 10గంటల నుంచే యువకులు గేట్ల వద్ద పడిగాపులు కాశారు.
పార్టీ ఆహ్వానించిన నేతలనే లోపలికి అనుమతించగా, మిగతా వారు అక్కడే ఉండి కేసీఆర్‌ కోసం ఎదురుచూశారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత కేసీఆర్‌ రావడంతో ఒక్కసారిగా బయట ఉన్నవారు తోసుకొచ్చారు. కేసీఆర్‌ను ఉద్దేశించి సీఎం.. సీఎం.. అంటూ నినాదాలు చేశారు. కేసీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. వీలుపడని వారు ఆయన కారు దిగుతుండగా సెల్ఫీలు దిగారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments