Friday, March 14, 2025
ads
Homeగాడ్జేట్స్ఈ జాతరకు వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆ...

ఈ జాతరకు వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆ భగవంతుడు దీవించాలి. –తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

ఈ జాతరకు వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆ భగవంతుడు దీవించాలి.
–తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

సత్యమేవ జయతే -సంగారెడ్డి /వికారాబాద్
సంగారెడ్డి వికారాబాద్ జిల్లాలోని కొండాపూర్ మోమిన్ పేట్ మండలాలలోని గంగారం టేకులపల్లి మధ్యలో ఉన్నటువంటి ఎత్తైన కొండపైన ఈ నెల 8వ తేదీ నుంచి జరుగుతున్న పరిశుద్ధ సిలువ గుట్ట జాతర మహోత్సవానికి ఆదివారం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మీ జాతర మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పరిశుద్ధ సిలువ గుట్ట జాతర మహోత్సవ కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క కుటుంబాన్ని ఆ భగవంతుడు యేసయ్య దీవించాలని వారి కష్టాలను పారద్రోలాలని ఈ సందర్భంగా ఆయన నా యేసయ్యను కోరారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత పదేళ్లపాటు తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టిందని ఉద్యోగస్తులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి తీసుకు వచ్చిందని రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని అలాంటి పరిస్థితుల్లో మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకువచ్చారని రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాగానే ఇప్పుడిప్పుడే రాష్ట్రం మొత్తం ఆర్థిక సంక్షోభం నుంచి బయటకు తీసుకు వస్తున్నామని ఆయన అన్నారు. అనంతరం జాతర ఇరు గ్రామాల సంఘ పెద్దలు ఆయనకు పరిశుద్ధ సిలువ గుట్ట ను రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని అదేవిధంగా దీన్ని దేవాదాయ శాఖలో కలిపితే ఈ సిలువ గుట్ట మరింత అభివృద్ధి చెందుతుందని కాబట్టి సిలువ గుట్టను రిజిస్ట్రేషన్ చేయించి అదేవిధంగా ఈ గుట్టకు ఈ రెండు గ్రామాల నుంచి రోడ్లు వేయించి అభివృద్ధి చేయాలని ఈ గంగారం టేకులపల్లి రెండు గ్రామాల సంఘ పెద్దలు రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారిని కోరగా వారు వెంటనే సానుకూలంగా స్పందించి ఒకనాడు ఈ రెండు గ్రామాల సంఘ పెద్దలు తమ దగ్గరికి వచ్చి కలిస్తే రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తానని, అదేవిధంగా రెండు గ్రామాల నుంచి ఈ గుట్ట పైకి రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా మహిళలకు ఇబ్బందులు కలగకుండా టాయిలెట్స్ కూడా వచ్చే జాతర వరకు టాయిలెట్స్ నిర్మాణాలను కూడా చేపట్టి మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు, సంఘ సేవకులు సంఘ పెద్దలు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments