సత్యమేవ జయతే/హత్నూర:
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం తుర్కల ఖానాపూర్ గ్రామ శివారులోని బీసీ ఎస్సీ నిరుపేదలకు ఇంటి స్థలాల కోసం కేటాయించిన ప్రభుత్వ భూమి కాపాడాలంటూ సాధుల్ నగర్ గ్రామ ప్రజలు మంగళవారం తహశీల్దార్ ఫర్విన్ షేక్ కు మంగళవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఇళ్ల స్థలాల కోసం తుర్కల ఖానాపూర్ గ్రామ శివారులో సర్వేనెంబర్ 120 లో ఎస్సీలకు ఎ 2- 22 గంటలు, సర్వే నంబర్ 112 లో బీసీలకు ఎ 1-31 గుంటల ప్రభుత్వ భూమిని గతంలోని ప్రభుత్వం కేటాయించిందన్నారు. ఇట్టి భూమి భూభారతి పోర్టల్ చూపించిన కొందరు వ్యక్తులు కబ్జాకు పాల్పడుతూ సాగు చేస్తున్నారని ఆరోపణలు వినిపించారు. ఇండ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని పరిశీలించి కబ్జాకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కోరుతూ వినతిపత్రం అందజేసినట్లు ఈ సందర్భంగా వారు తెలిపారు. వినతి పత్రం సమర్పించిన వారిలో మనోహర్, భాస్కర్, మల్లేశం, శేఖర్, రమేష్, యాదగిరి, కృష్ణ మాణిక్యం, చిన్న పాపయ్య, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.