సత్యమేవ జయతే – శేర్లింగంపల్లి
శేర్లింగంపల్లి : తెలంగాణ రాష్ట్ర మహిళ న్యాయ సదస్సు కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్ కు విచ్చేసిన ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి అల్కలంబ గారిని తెలంగాణ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారితో మర్యాద పూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పుష్పగుచ్చం అందజేసి హర్ధిక శుభాకాంక్షలు తెలియజేసిన శేర్లింగంపల్లి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి శిరీష సత్తూర్ గారు.
ఈ సందర్భంగా రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికై రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలను శిరీష సత్తూర్ గారు ఆమెకు వివరించారు. అంతేకాకుండా మహిళా సాధికారతకు చేయవలసిన పలు కార్యక్రమాలు గురించి కూడా ఈ సమావేశంలో చర్చించడం జరిగింది.