సత్యమేవ జయతే,బోథ్: ఆర్టీసీ బస్,ఆటో ఢీకొనడంతో ఒకరు మృతి చెందిన ఘటన మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బోథ్ మండలం కూచులపూర్ వెంకటేశ్వర ఆలయ సమీపంలో ఆర్టీసీ బస్, ఆటో ఢీకొనడంతో నిర్మల్ జిల్లా చిట్యాల గ్రామానికి చెందిన లక్ష్మ రెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా ఆటో డ్రైవర్ కు తీవ్ర గాయాలయ్యాయి. లక్ష్మారెడ్డి, బోథ్ మండలం ధన్నూర్ గ్రామంలో ఉండే తన కూతురు ఇంటికి ఆటోలో బియ్యం తీసుకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. ఉట్టి ప్రమాదానికి రోడ్డుకు ఇరువైపులా ఏపుగా పెరిగిన చెట్టు కొమ్మలే కారణమని స్థానికులు భావిస్తున్నారు. క్షతగాత్రున్ని చికిత్స కోసం బోథ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
