Tuesday, June 17, 2025
ads
Homeక్రైమ్ న్యూస్ఆఫీసులోనే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ లేడీ ఏఈ..

ఆఫీసులోనే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ లేడీ ఏఈ..

ఆఫీసులోనే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ లేడీ ఏఈ..

కాప్రా సర్కిల్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించి ఓ అసిస్టెంట్ ఇంజనీర్ ను లంచం తీసుకుంటూ ఉండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

చర్లపల్లి ఏఈ స్వరూప ఓ కాంట్రాక్టర్ నుంచి రూ. 1.20 లక్షలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. రామ్ రెడ్డి అనే కాంట్రాక్టర్ తన బిల్లులు చెల్లించడానికి ఏఈ స్వరూప రూ. 1.20 లక్షలు లంచంగా డిమాండ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

స్వరూప లంచం కోసం ఒత్తిడి చేయడంతో కాంట్రాక్టర్ రామ్ రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. పక్కా ప్రణాళికతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, కాప్రా మున్సిపల్ కార్యాలయం గేటు దాటేలోపే ఏఈ స్వరూపను అదుపులోకి తీసుకున్నారు. ఆమె వద్ద నుంచి రూ. 1.20 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

గతంలో కూడా ఏఈ స్వరూప పై కాంట్రాక్టర్లను లంచాల కోసం వేధింపులకు గురి చేసిందనే ఆరోపణలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో జీహెచ్ఏంసీ కార్యాలయంలో అవినీతి మరోసారి బట్టబయలైంది. ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments