సత్యమేవ జయతే వికారాబాద్ జిల్లా..
మంగళవారం ఎం ఆర్ పి ఎస్ ఎం ఎస్ పి అనుబంధ సంఘాల నాయకుల అత్యవసర సమావేశం స్థానిక వికారాబాద్ జిల్లా కేంద్రంలోని క్లబ్ ఫంక్షన్ హాల్ లో ఎం ఆర్ పి ఎస్ జిల్లా అధికార ప్రతినిధి గజ్జల ప్రకాష్ మాదిగ అధ్యక్షతన జరిగింది..
ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార ప్రతినిధి రామకృష్ణ మాదిగ( జిల్లా ఇంచార్జి)
హాజరయ్యారు…
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…
వికలాంగుల పెన్షన్ 6 వేలకు వృద్ధులు వితంతువుల చేయూత పెన్షన్ 4 వేలకు పెంచాలని కాంగ్రెస్ తమ మేనిఫెస్టో పెన్షన్ పై ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని ఇట్టి విషయమై మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వికలాంగుల మరియు చేయూత పెన్షన్ దార్ల గర్జన పోరాటం ఉదృతం కాకంటే ముందే రేవంత్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని లేని పక్షం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించుకోవాలని అది మంద కృష్ణ మాదిగ గారి వల్లనే జరుగుతుంది అని డిమాండ్ చేయడం జరిగింది.*
ఈ కార్యక్రమం లో ఎం ఆర్ పి ఎస్, జిల్లా కాలేజీ ఇంచార్జి గట్టగాళ్ల ప్రశాంత్ మాదిగ, ఎం ఎస్ పి జిల్లా అధ్యక్షులు పి. ఆనంద్ మాదిగ, ఎం అర్ పి. ఎస్
, జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ మాదిగ, వివిధ మండలాల ఇంచార్జి లూ పాల్గొన్నారు..