Friday, March 14, 2025
ads
Homeఅనంతపురంఅన్ని కేసుల్లో పోసానికి బెయిల్.. విడుదలకు బ్రేక్..

అన్ని కేసుల్లో పోసానికి బెయిల్.. విడుదలకు బ్రేక్..

సత్యమేవ జయతే – గుంటూరు
గుంటూరు : నటుడు పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు అయింది. అయితే విడుదలకు బ్రేక్ పడింది. సీఐడీ పోలీసులు పీటీ వారెంట్‌పై పోసానిని కోర్టులో హజరుపర్చనున్నారు. మంగళవారం పోసానికి కర్నూలు జే‌ఎఫ్‌ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను దూషించిన కేసులో పోసాని అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.
సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళి మంజూరు అయింది. అయితే జైలు నుంచి విడుదలకు బ్రేక్ పడింది. పోసానిపై సిఐడి పోలీసులు పీటి వారెంట్ వేశారు. ఈ క్రమంలో పోసాని ఉన్న కర్నూలు జిల్లా జైలుకు గుంటూరు సిఐడి పోలీసులు వెళ్లారు. పీటీ వారెంట్‌పై పోసానిని కోర్టులో హజరుపర్చనున్నారు. కర్నూలు జైలు నుంచే ఆన్ లైన్‌లో సీఐడీ పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చనున్నారు. కాగా ఇప్పటికే అన్ని కేసులలో పోసానికి బెయిల్ మంజూరైంది. తాజాగా సీఐడీ పోలీసుల పీటి వారెంట్‌తో పోసాని విడుదలకు బ్రేక్ పడింది.
మరోవైపు పోసాని కృష్ణమురళిని వారం రోజులపాటు తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పల్నాడు జిల్లా నరసరావుపేట 2 టౌన్‌ పోలీసులు స్థానిక మొదటి అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు కోసం విచారణను కోర్టు బుధవారానికి వాయిదా వేసింది. ఈ నెల 3న అన్నమయ్య జిల్లా రాజంపేట సబ్‌జైలు నుంచి పీటీ వారెంట్‌పై పోసానిని తీసుకువచ్చిన నరసరావుపేట పోలీసులు స్థానిక కోర్టులో హాజరు పరిచారు. దీంతో న్యాయస్థానం పోసానికి రిమాండ్‌ విధించింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసును సమగ్రంగా విచారించేందుకు పోసానిని వారం రోజులపాటు కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఈ నెల 3నే పిటిషన్‌ దాఖలు చేశారు. ఇరుపక్షాల వాదనలను విన్న న్యాయస్థానం రెండు రోజులపాటు(ఈ నెల 8, 9 తేదీల్లో) పోసానిని నరసరావుపేట 2 టౌన్‌ పోలీసుల కస్టడీకి అనుమతించింది.

అయితే, ఆ రెండు రోజుల్లో విజయవాడ భవానీపురం పోలీసులు పోసానిని పీటీ వారెంట్‌పై తీసుకువెళ్లడంతో పోలీస్‌ కస్టడీకి తీసుకోవడం సాధ్యపడలేదు. దీంతో తాజాగా మరోసారి కస్టడీ పిటిషన్‌ దాఖలు చేశారు. ఇక కర్నూలు జైల్లో ఉన్న పోసానికి విజయవాడలోని చీఫ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అదే విధంగా కర్నూలు జిల్లా ఆదోనిలో నమోదైన కేసులోనూ పోసానికి బెయిల్‌ లభించింది. ఆదోని అదనపు జ్యూడిషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ ఇన్‌చార్జి మెజిస్ర్టేట్‌ అపర్ణ మంగళవారం బెయిల్‌ ఆదేశాలు జారీ చేశారు.

కాగా పోసాని కృష్ణమురళికి బెయిల్ మంజూరు అయింది. మంగళవారం ఆయనకు కర్నూలు జే‌ఎఫ్‌ సీఎం కోర్టు మేజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేశారు. టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేష్, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను దూషించిన కేసులో పోసాని అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.

2024, నవంబర్ 14వ తేదీన ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ఆదోని త్రీ టౌన్‌లో పోలీస్ స్టేషన్‌లో పోసానిపై జనసేన నేత రేణు వర్మ ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆయనపై బీఎన్‌ఎస్ 353(1),353(2),353(సి)సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ క్రమంలో మార్చి 5వ తేదీ నుంచి పోసాని కర్నూలు జైలులో ఉన్నారు.

మరోవైపు విజయవాడలోని చీఫ్ జ్యూడిషియల్ కోర్టు సైతం పోసానికి బెయిల్ మంజూరు చేసింది. భవానీపురం పోలీస్ స్టేషన్‌లో పోసాని కృష్ణమురళిపై జనసేన నేత బాడిత శంకర్ ఫిర్యాదు చేశారు.ఇటీవల పీటీ వారెంట్‌పై కోర్టులో పోసానిని హాజరుపర్చగా.. న్యాయమూర్తి రిమాండ్ విధించిన సంగతి తెలిసిందే. నేడు పోసానికి విజయవాడలోని చీఫ్ జ్యూడిషియల్ కోర్టు సైతం బెయిల్ మంజూరు చేసింది.

గత వైసీపీ ప్రభుత్వం.. పోసాని కృష్ణమురళిని ఆంధ్రప్రదేశ్‌ స్టేట్‌ ఫిల్మ్‌ టెలివిజన్‌ అండ్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఎస్‌ఎఫ్‌టీవీటీడీసీ) చైర్మన్‌గా నియమించింది. ఆ క్రమంలో నాటి ప్రతిపక్ష నేత, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌పై తీవ్ర అభ్యంతరకర భాషతో విరుచుకు పడ్డారు.

ఈ నేపథ్యంలో పోసానిపై రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో కేసులు నమోదయ్యాయి. ఆ క్రమంలో ఇటీవల హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని పోసానిని.. ఆయన నివాసంలో ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం ఏపీకి తరలించారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పలు కేసులు నమోదు కావడంతో.. ఒకే కేసులో పోసానికి బెయిల్ మంజూరు అయితే.. మరో కేసులో ఆయన అరెస్ట్ అవడం జరుగుతోన్న సంగతి తెలిసిందే.

అదీకాక పోసానికి బెయిల్ మంజూరు చేయవద్దంటూ ప్రభుత్వం తరుఫు న్యాయవాదులు కోర్టుల్లో వాదిస్తున్నారు. ఆయన ఈ విధంగా మాట్లాడడం వెనుక ఎవరు ఉన్నారనే అంశంపై విచారణ జరగాల్సి ఉందని కోర్టుకు వారు స్పష్టం చేస్తున్నారు. అలాంటి వేళ.. పోసానికి బెయిల్ మంజూరు అయింది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular

Recent Comments