సత్యమేవ జయతే వికారాబాద్ జిల్లా….
భూభారతిలోని భూ సమస్యలు అవకతవకలూ గాని మార్పులు, చేర్పులు, గాని ఉంటే వెంటనే పరిష్కరించుకోవాలని వికారాబాద్ తహసీల్దార్ లక్ష్మి నారాయణ అన్నారు. గురువారం వికారాబాద్ మండల కేంద్రంలో అత్వెల్లి భూభారతి కార్యక్రమం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి రెవెన్యూ సదస్సుల ద్వారా రైతుల యొక్క భూ సమస్యలతో సంవత్సరాల తరబడి సతమతమవుతున్న రైతుల సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. అనంతరం ఈ రెవెన్యూ సదస్సుల ద్వారా రైతుల భూ సమస్యలు పరిష్కరించబడతాయని అన్నారు.గురువారం వికారాబాద్ మండల పరిధిలో అత్వెల్లి లో భారీగా దరఖాస్తు లు వస్తున్నాయి భూ భారతి రెవెన్యూ సదస్సులు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుండి ధరణి చట్టం ద్వారా అసలైన పేద రైతులకు న్యాయం జరుగుతుందని అన్నారు.. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూ భారతి చట్టం ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ సదస్సులలో రైతుల సమస్యలకు సంబంధించిన ఆర్జీలను సమర్పించి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మోహన్ రెవిన్యూ ఇన్స్పెక్టర్ నరేష్ పంచాయతి కార్యదర్శి పూర్ణిమ సిబ్బంది కృష్ణ ప్రవీణ్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు..